ఆదిలాబాద్‌లోని డైట్ మైదానంలో ఆయుత చండీ యాగం భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతోంది. శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి జి నేతృత్వంలో భక్తిశ్రద్ధల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు శుక్రవారం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ఇలాంటి యాగాలు ఆదిలాబాద్ లో జరగడం మనందరి అదృష్టమని అన్నారు.