కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన ఎంపీ

73చూసినవారు
కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసిన ఎంపీ
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలని ఎంపీ గోడం నగేష్ కోరారు. ఈమేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ విషయంలో విధానపర నిర్ణయం తీసుకుని తప్పక మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చినట్లు ఎంపీ నగేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్