ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేయకుండానే అన్ని ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. ఇందులో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరగా ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ కోరారు.