ఈటెలపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన ముదిరాజ్ మహాసభ

79చూసినవారు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నేత శివయ్య పేర్కొన్నారు. ముదిరాజ్ కులస్థులను కులం పేరుతో దూషిస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్