జీవితంలో మరిన్ని విజయాలను సాధించాలి: జిల్లా ఎస్పీ

58చూసినవారు
జీవితంలో మరిన్ని విజయాలను సాధించాలి: జిల్లా ఎస్పీ
డీఎస్సీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలలో కానిస్టేబుల్ షేక్ ఇంజమాముల్ హక్ చెల్లెలు షరీన్ పర్వీన్ రాష్ట్రంలోనే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలోని ఉర్దూ మీడియంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా డీఎస్సీ ఎస్జిటిలో రెండవ స్థానాన్ని సాధించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. జీవితంలో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు

సంబంధిత పోస్ట్