చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

71చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల కళాశాల, పాఠశాలలో గురువారం డీఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు డీఎల్ఎస్ఎ కార్యదర్శి బి. సౌజన్య మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గత నెల 22న వసతి గృహాన్ని సందర్శించి లోటుపాట్లను గుర్తించి సుమోటోగా కేసునమోదు చేశామన్నారు. దాని వల్ల వసతి గృహంలో కొన్ని సౌకర్యాలు వచ్చాయని మిగతా వాటికి కూడా కృషి చేస్తామన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్