ఆదిలాబాద్‌: ఎన్. సి. సి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

69చూసినవారు
ఆదిలాబాద్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో 32వ తెలంగాణ బెటాలియన్ ఎన్. సి. సి ఉమ్మడి జిల్లా వార్షిక శిక్షణ క్యాంప్‌ను గురువారం ప్రారంభించారు.  కర్నల్ వికాస్ శర్మ హాజరై ఎన్. సి. సి క్యాడెట్స్‌కు దిశానిర్దేశం చేశారు. ముందుగా ఎన్. సి. సి గీతాన్ని ఆలపించారు. 10 రోజుల వార్షిక శిబిరాన్ని ఎన్. సి. సి క్యాడెట్‌లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాడెట్స్‌లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడమే ఎన్. సి. సి లక్ష్యమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్