ఎన్. హెచ్. ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

82చూసినవారు
ఎన్. హెచ్. ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ఎన్. హెచ్. ఎం ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్ చేయాలని ఎన్. హెచ్. ఎం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు దొంతుల ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్సీ కోదండరాంకు వినతి పత్రం సమర్పించారు.
ఎన్. హెచ్. ఎం ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ప్రోగ్రామ్ లలో అందిస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. సీఎంతో మాట్లాడి న్యాయం చేసేలా చూస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్