ప్రారంభమైన నాగోబా గంగాజల పాదయాత్ర

50చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాల్లో భాగంగా మెస్రం వంశీయులు గంగ నీళ్ల కోసం శుక్రవారం బయలుదేరారు. కేస్లాపూర్ ఆలయంలో సంప్రదాయా ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి నాగోబా మహాపూజకు ఉపయోగించే గంగాజల సేకరణ కోసం పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కేస్లాపూర్ నుంచి బయలుదేరిన మెస్రం వంశీయులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ జన్నారం మండలం హస్తినమడుగు వద్ద నుండి గోదావరి పవిత్ర జలమును తీసుకొని రానున్నారు.

సంబంధిత పోస్ట్