నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రశాంత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. పీ. జీ. టి రసాయనశాస్త్రం(Chemistry)లో ఉన్న ఖాళీ పోస్టుకు ఈ నెల 12న కళాశాలలో డెమో క్లాస్ ఉంటుందన్నారు. కాగా, అర్హులైన అభ్యర్థులు సరైన ద్రువపత్రాలతో సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.