నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వా గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా గిరిజన మొవ లడ్డు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్ హాజరై ప్రారంభించారు. యూనిట్ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జవహర్, తహశీల్దార్ రాజలింగు, ఏపీడి స్వామి, ఏపీఎం రమేష్, మహిళా సభ్యులు పాల్గొన్నారు.