నార్నూర్: ఉరుములు మెరుపులతో భారీ వర్షం

75చూసినవారు
నార్నూర్ మండలంలోని భీంపూర్, మల్కుగూడ, మహాగావ్, చొర్గావ్, సుంగాపూర్, మాన్కపూర్, గంగాపూర్, తాడిహత్నూర్, కొత్తపల్లితో పాటు తదితర గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్