నార్నూర్: మాజీ సర్పంచిని సన్మానించిన నాయకులు

72చూసినవారు
నార్నూర్: మాజీ సర్పంచిని సన్మానించిన నాయకులు
నార్నూర్ మండలంలోని భీంపూర్ మాజీ సర్పంచి రాథోడ్ విష్ణు శనివారం మలంగిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సంత్ సేవాలాల్ టెక్డి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన్ను దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దారావత్ ప్రవీణ్ నాయక్, నిర్మాణ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ప్రవీణ్ తన సొంత ఖర్చులతో సమాజ అభివృద్ధికి కృషి చేయడం హర్షంగా ఉందన్నారు. కార్యక్రమంలో మహేందర్, అరవింద్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్