నార్నూరులోని సరస్వతి మండల సమాఖ్య కేంద్రంలో గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మానవాభివృద్ధి కింద వీఓ, ఓబీ, వీఓఏలకు ఒకరోజు పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం, సైబర్ ఆధారిత అక్రమ రవాణా అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళలు తదితరులు ఉన్నారు.