ఆదివాసీలోని గాడ్బోరికర్ పెర్సపేన్ దేవత తమకు ధైర్యమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లాధ్యక్షుడు పెందోర్ దాదిరావు అన్నారు. గురువారం నార్నూర్ మండలంలోని దన్నుగూడలో నిర్వహించిన పెర్సపేన్ ఊరేగింపులో ఆయన హాజరయ్యారు. అనంతరం సంస్కృతి సాంప్రదాయబద్దంగా దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ఆదివాసీ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. కటోడ భీంరావు, మాధవరావు, యాదవరావు పాల్గొన్నారు.