నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక డా. అంబెడ్కర్ చౌక్ ఎదుట శుక్రవారం బహుజన నాయకులు, మహిళలు కలిసి ఎస్సీ వర్గీకరణ తీర్పు పత్రాన్ని దహనం చేశారు. లోఖండే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాల, మహర్ సమాజానికి అన్యాయం చేసిందన్నారు. దీన్ని వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.