నార్నూర్ మండల కేంద్రంలోని విజయ నగర్ కాలనీలో ఉన్న పలు వార్డుల్లో గత 15 ఏళ్ళ ముందు నిర్మించిన మురుగు కాలువలు పూర్తిగా కూలిపోయాయి. దీంతో వర్షాకాలం నేపథ్యంలో మురుగు నీరు పలువురి ఇళ్ల ముందు నుండి ప్రవహిస్తుండడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం దక్కలేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు కాలువలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.