నార్నూర్: 'అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలి'

53చూసినవారు
నార్నూర్: 'అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలి'
భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలని అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ రెడ్డి నాయక్ అన్నారు. సోమవారం నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామంలో డా. అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో లింబరావు జాడే, జాదవ్ సచిన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్