నార్నూర్ మండల కేంద్రానికి చెందిన గిరిజన యువకుడు రాథోడ్ విజయ్ ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఈ మేరకు శనివారం గ్రామస్థులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. మండలంలోని యువకులు విజయ్ ను ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాలు సాధించాలని మాజీ సర్పంచి గజానంద్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దిగంబర్, సికిందర్, ఫిరోజ్, సుభాష్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.