నార్నూర్ మండల కేంద్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. అసంపూర్తిగా నిర్మించి ఉన్న ఆ ఇళ్లను ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించింది. అనేక రోజుల నుండి కనీసం వాళ్లకు నీటి, సరైన రోడ్డు, విద్యుత్తు సరఫరా లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు డిమాండ్ చేశారు.