నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో మంగళవారం సికిల్ సెల్ పై వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పారిశుధ్యం, పర్యావరణ వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్థులకు వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో వివిధ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య పర్యవేక్షకుడు సంతోష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సయ్య, నరేందర్ రెడ్డి, సాయన్న, విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.