నేరడిగొండ మండల కేంద్రంలోని PHC ఆసుపత్రిలో ఆరోగ్య పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న సంతోష్ ఇటీవల ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు శనివారం ఆసుపత్రి సిబ్బంది, ఆశ కార్యకర్తలు కలిసి ఆయన్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కోసం నిత్యం తిరుగుతూ వివిధ జ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న సంతోష్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.