జైనూర్ సంఘటన దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎలాంటి సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. అనుమతులు లేకుండా గుమిగూడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. అన్ని మండలాలలో బంద్ ఉందంటూ ప్రచారం చేసిన, బంద్ చేయడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని ప్రస్తుతం జైనూరు మండలం ప్రశాంత వాతావరణంలో ఉందని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు.