నార్నూర్ పంచాయతీ కార్యదర్శి ఆర్. దినేష్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నార్నూర్ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దుర్గంధం కనిపించడంతో ఎంపీవో స్వప్నశీల ను పిలిచి మందలించారు. ఈ మేరకు ఎంపీవోకు ఛార్జి మెమో జారీ చేశారు.