తాగునీటి సమస్యలపై అధికారుల ఆరా

84చూసినవారు
తాగునీటి సమస్యలపై అధికారుల ఆరా
ఆదిలాబాద్ బల్దియాలో మిషన్ భగీరథ తాగునీటి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు వార్డుల్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బల్దియా, పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ శాఖల అధికారులు సంయుక్తంగా పట్టణంలోని భుక్తాపూర్, కైలాస్ నగర్, కేఆర్కే కాలనీల్లో తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. బల్దియా కమిషనర్ ఖమర్ అహ్మద్, డీఈఈ తిరుపతి, పబ్లిక్ హెల్త్ ఈఈ గంగాధర్, మిషన్ భగీరథ ఈఈ గోపీచంద్, ఉన్నారు

సంబంధిత పోస్ట్