ఆదిలాబాద్ లో కొనసాగుతున్న వైద్య శిబిరాలు

85చూసినవారు
ఆదిలాబాద్ లో కొనసాగుతున్న వైద్య శిబిరాలు
జిల్లాలో సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యారోగశాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని కాలనీల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాంనగర్, దస్నాపూర్ కాలనీలో వైద్య సిబ్బంది డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న పిల్లలకు వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శ్రీవాణి, ఆశా కార్యకర్త సునీత, ఆర్పీ ధనశ్రీ, వైద్య సిబ్బంది పరశురాం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్