మహాత్మా గాంధీజీ సూచించిన ప్రకారం అహింస మార్గం ద్వారానే శాంతిని స్థాపించవచ్చు అని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి కమిషనర్ ఖమర్ అహ్మద్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సైతం నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహనీయుల సేవలను సమరించుకున్నారు.