త్వరలోనే పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలనీ ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. సమస్యలను ప్రస్తవిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.