కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

64చూసినవారు
ఆర్టీసీ సంస్ధ ద్వారా కల్పిస్తున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్గో మేనేజర్ బి. పాల్ అన్నారు. ప్రజలకు కార్గో సేవలపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం టీజీఎస్ ఆర్టీసీ కార్గో విభాగం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్గో ద్వారా తక్కువ వ్యయంతో వేగంగా గమ్యం చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సిబ్బంది కే. సాయన్న, యస్. కే ఆన్సర్, మహేశ్వర్, తదితరులున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్