కొత్తగా భవన నిర్మాణం చేపట్టేవారు కార్మిక శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని సహాయ కార్మిక అధికారులు రాజలింగు, వినోద్ అన్నారు. కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆదిలాబాద్ లో తిరుగుతూ నిర్మాణదారులకు అవగాహన కల్పిస్తున్నారు. బల్దియాలో అనుమతి తీసుకునేటప్పుడు లేబర్ సెస్ చెల్లిస్తున్నారని, కానీ కార్మిక శాఖకు దరఖాస్తు చేసుకోవడం లేదన్నారు. గుర్తింపు కార్డులున్న కార్మికులనే పనిలో పెట్టుకోవాలన్నారు