కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి గ్రామంలో గల శబరిమాత ఆశ్రమానికి ఆదిలాబాద్ జిల్లా భక్తులు పాదయాత్ర చేపట్టారు. జిల్లాకేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ఈ పాదయాత్ర బుదవారం ప్రారంభమైంది. మఠాధిపతి యోగానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై ఈ యాత్రను ప్రారంభించి వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రతియేటా ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతోందని మఠాధిపతి మీడియాకు తెలిపారు.