ఈనెల 21న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సదానందం తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10: 00 గంటల నుంచి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు పట్టణంలోని ఖానాపూర్, సోనార్ గల్లి, బొక్కలగూడ, కొలిపురా, మసూద్ చౌక్ , ధంగార్ గల్లి, శాంతినగర్ ఏరియాలలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఈ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులందరూ సహకరించాలని కోరారు.