సినిమా థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల సందడి

76చూసినవారు
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన కల్కి 2898 AD సినిమా అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా పట్టణంలోని థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల సందడి నెలకొంది. ఈ మేరకు ప్రభాస్ అభిమానులు టపాసులు కాల్చి, ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సందడిగా గడిపారు. ఉదయం నుంచి థియేటర్ల వద్ద అభిమానుల రద్దీ నెలకొంది. థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డు లను పెట్టేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్