బేల మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌక్ వద్ద మాజీ సర్పంచ్ వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్ఐ దివ్యభారతి సోమవారం ప్రారంభించారు. వేసవి నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్, బీజేపీ నాయకులు తదితరులున్నారు.