బేలా మండలం దేవ్‌జి గూడలో పీఎం జన్మన్ నిధులు రూ. 60 లక్షలతో మల్టీపర్పస్ కేంద్రం భవనం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు నిధులు కేటాయించినందుకు బీజేపీ నాయకులు, గ్రామస్తులు ప్రధాని నరేంద్ర మోదీ, ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు ప్రమోద్ రెడ్డి, సలాం దేవ్రవ్, ఆదివాసులు తదితరులు పాల్గొన్నారు.