రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన వారే నేడు ఆయన ఫొటో పట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని బీజేపి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అంబేడ్కర్‌ను అవమానించిందని ఆరోపించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు