కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనలు నిరసిస్తూ ఆదిలాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం ప్రైవేటు ఆసుపత్రులన్నీ మూసివేసి బంద్ పాటిస్తున్నట్లు ఐఎంఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ శ్యాంప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఆసుపత్రులన్నీ మూసివేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిరసన ప్రదర్శన ఉంటుందని వైద్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.