జైనూరులో ఆదివాసి మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ధోని జ్యోతి డిమాండ్ చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.