వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని రిమ్స్ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు సందీప్ చారి అన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను ఖండిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక మెడికల్ కాలేజ్ నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. నిందితుడి పై చర్యలు తీసుకునే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.