ఎస్సీ వర్గీకరణను ఖండిస్తూ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేయడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాయకులకు పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. వర్గీకరణ చేపట్టి సీఎం మాలలకు ద్రోహం చేశారని సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ ఆరోపించారు.