ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక

64చూసినవారు
ఉపాధి హామీ పనులపై ప్రజావేదిక
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై డీఆర్డీవో అధికారులు ప్రజావేదిక నిర్వహించారు. బుధవారం మావల ఎంపీడీవో కార్యాలయంలో మావల, బట్టిసావర్గాం, వాఘాపూర్ పంచాయతీల్లో 2023-24 సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులపై అదనపు డీఆర్డీఓ కుటుంబరావు విచారణ చేశారు. రూ. 95 లక్షలు విలువైన పనులకు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు. కొలతల్లో తేడా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ప్రదీప్ కుమార్, వీణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్