ఆదిలాబాద్ లో వర్షం

57చూసినవారు
ఆదిలాబాద్ లో శుక్రవారం జోరు వాన కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు భారీ వర్షానికి పలుచోట్ల మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. పట్టణంతో పాటు పలు మండలాల్లో సైతం వర్షం కురుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్