అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో సైతం వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఉడుకుపోతతో ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలకు వర్షం వల్ల వాతావరణం చల్లబడడంతో ఉపశమనం లభించింది.