టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియ ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచిన నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. టీం ఇండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన భారత ఆటగాళ్ళు చూపిన క్రీడా స్ఫూర్తి అభినందనీయమని పేర్కొన్నారు. భారత జట్టు సాధించిన విజయంతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని అన్నారు.