మున్నూర్ కాపు మహిళా సంఘం ఆధ్వర్యంలో రథ సప్తమి వేడుకలను ఆదిలాబాద్‌లోని సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇచ్చే వాయినాలు, నోములు రథ సప్తమికి ముగుస్తాయి. అందులో భాగంగానే మంగళవారం సంఘం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నోములు, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రథ సప్తమి వేడుకలతో సంఘ భవనంలో పండుగ వాతావరణం నెలకొంది