పేద కుటుంబాలకు గూడు కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ మండలాధ్యక్షుడు లావుడ్య రమేష్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోని తుంగేడ గ్రామంలో లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్, రవీందర్, తిరుపతి మల్లయ్య తదితరులున్నారు.