రైతుల కోరిక మేరకే సత్నాల ప్రాజెక్టు నుండి ఎడమ, కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. ఈ మేరకు శనివారం సత్నాల ప్రాజెక్టు నుండి, అధికారులు, రైతులతో కలిసి నీటిని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం నవంబర్లో రైతులకు సత్నాల ప్రాజెక్టు నుండి నీరు అందించడం జరుగుతుందన్నారు. సత్నాల ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ. 19 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగిందన్నారు.