పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితా విడుదల

55చూసినవారు
పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితా విడుదల
ఆదిలాబాద్ జిల్లాలో పని చేస్తున్న గ్రేడ్-4 గ్రామ పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లాలో 320మంది పని చేస్తుండగా అందులో 4 సంవత్సరాలు ఒకే చోట సర్వీసును పూర్తి చేసుకున్నవారు 245మంది ఉన్నారు. ఇందులో తప్పనిసరి బదిలీ కింద 40శాతం మందిని ఉన్నచోట నుంచి కదిలించాలని నిబంధనలు ఉండటంతో 128 మంది కార్యదర్శులకు బదిలీకానుంది. ఐచ్ఛికాల దరఖాస్తును ఈ నెల 12లోగా కార్యాలయంలో సమర్పించాలి.

ట్యాగ్స్ :