ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెన్యూవల్ చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వేణుయాదవ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదిలాబాద్ డీఐఈవో రవీందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. 2012నుంచి జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న తమ సర్వీస్ ను రెన్యూవల్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. స్పందించిన డీఐఈవో సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.