కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుదవారం రాత్రి ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ ఎదుట, ఎమర్జెన్సీ డిపార్ట్ ముందు కొవ్వత్తులతో ఆందోళన చేపట్టారు. వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు